TG: యాదాద్రి జిల్లాలో మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. జూలూరు దగ్గర లోలెవెల్ బ్రిడ్జిపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో పోచంపల్లి-బీబీనగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సంగెం భీమలింగం దగ్గర వంతెన పైనుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. చౌటుప్పల్-భువనగిరి మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. మూసీ పరివాహక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.