బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జన సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ డెప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరిపై తీవ్ర ఆరోపణలు చేశారు. డిగ్రీ పట్టా ఉన్నట్లు చెప్పుకుంటున్న చౌదరి పదో తరగతి కూడా పాస్ కాలేదని పీకే విమర్శించారు. ఓ కేసులో జైలుకు వెళ్లిన చౌదరి, గత ఎన్నికల అఫిడవిట్లో పదో తరగతి ఫెయిల్ అని పేర్కొని, ఆ తర్వాత డిగ్రీ ఉన్నట్లు చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.