NLG: దివ్యాంగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. మంగళవారం అనుముల పట్టణంలోని లక్ష్మీనరసింహస్వామి గార్డెన్స్‌లో జరిగిన నాగార్జునసాగర్ నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దివ్యాంగుల పెన్షన్ పెంచి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.