ఆల్‌రౌండర్ శివమ్ దూబే సేవలను కెప్టెన్ సూర్యకుమార్ సమర్థవంతంగా వినియోగించుకుంటున్నాడని సెహ్వాగ్ అన్నాడు. గతంలో దూబేని కేవలం బ్యాటర్‌గా మాత్రమే ఉపయోగించుకున్నారని, కానీ సూర్య మాత్రం అతడిని బౌలర్‌గా కూడా పరిగణిస్తున్నాడని పేర్కొన్నాడు. దుబాయ్‌లోని పిచ్ నెమ్మదిగా ఉండటం కూడా దూబే బౌలింగ్‌కు అనుకూలంగా మారిందని అభిప్రాయపడ్డాడు.