AP: రేషన్ స్మగ్లింగ్‌పై మండలిలో వైసీపీ, కూటమి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఏడాదిలో అక్రమ రవాణా చేస్తున్న 5.65 లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు మంత్రి నాదెండ్ల వెల్లడించారు. దీనిపై వైసీపీ MLC ఇజ్రాయెల్ స్పందిస్తూ.. మంత్రి సినిమా డైలాగ్‌లు చెప్తున్నారని అన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్లే రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించారు.