ATP: విజయవాడ కనకదుర్గ అమ్మవారిని బుధవారం ఉదయం అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. భక్తులందరిపై అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.