NGKL: అమ్రాబాద్ మండలం వెంకటేశ్వర్లబావి గ్రామంలో ‘స్వచ్ఛతా హీ సేవ’లో భాగంగా గ్రామస్తులు శ్రమదానం నిర్వహించారు. టెక్నికల్ అసిస్టెంట్ వెంకటేష్ ఆధ్వర్యంలో గ్రామ మహిళా సంఘాల సభ్యులు గ్రామంలోని పరిసరాలను శుభ్రం చేసి చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా వారంతా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతిజ్ఞ చేశారు.