AP: కడప(D) ఒంటిమిట్టను పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు టీటీడీ నిపుణుల బృందం కీలక ప్రతిపాదన చేసింది. ఒంటిమిట్ట చెరువు మధ్యలో 600 అడుగుల ఎత్తులో శ్రీరాముడి విగ్రహం నిర్మించాలని సూచించారు. విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్&ఆర్కిటెక్చర్ నిపుణులు రాబోయే 30 ఏళ్లలో పెరిగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రణాళికను తయారు చేశారు.