KMM: CPI జాతీయ సమితి నూతన కమిటీలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. జాతీయ సమితి సభ్యులుగా మొదటిసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషా ఎన్నిక కాగా, ఆయనతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన భాగం హేమంతరావుకు రెండవసారి జాతీయ సమితి సభ్యుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఉమ్మడి పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు శుభాకాంక్షలు తెలిపారు.