అనంతపురం: జిల్లా మంత్రి సవిత, ఎమ్మెల్యేలు పరిటాల సునిత, బండారు శ్రావణి, పల్లె సింధూర రెడ్డి పసుపు రంగు చీరలో నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. నవరాత్రుల నాల్గవ రోజు సందర్భంగా ఈ దుస్తులు ధరించి అసెంబ్లీకి హాజరైనట్లు వారు తెలిపారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా పసుపు రంగు దుస్తులు ధరించడం సంతోషం, ఆనందం, శుభాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.