SKLM: నరసన్నపేట మండలం మడపాం పంచాయితీలో రహదారి పనుల నిర్మాణానికి ప్రతిపాదనలు చేసేందుకు పరిశీలించామని ఇంఛార్జ్ ఎంపీడీవో విజయానంద్ తెలిపారు. ఇవాళ మండల ఇంజనీర్ బగ్గు నరసింగరావుతో కలిసి రహదారిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంఛార్జ్ ఎంపీడీవో మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాలు మేరకు పనులకు ప్రతిపాదనలు చేపడుతున్నామని తెలియజేశారు.