ప్రకాశం: దర్శి మండలం చలివేంద్రంలో గురువారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు ప్రమాదవశాత్తు కాలు జారి నీటికుంటలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.