ప్రకాశం: దర్శి మండలం చలివేంద్రం గ్రామంలో ఇవాళ విషాదం చోటుచేసుకుంది. దసరా సెలవులకు విజయవాడ నుంచి చలివేంద్రం గ్రామం కొచ్చిన అఖిల్, నిఖిల్ అనే ఇద్దరు కవల పిల్లలు గ్రామంలోని నీటి కుంటలో ఈతకు వెళ్లి మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జరిగిన ప్రమాదంపై కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.