మేడ్చల్: కీసర PS పరిధి నర్సంపల్లిలో కన్న కూతురిని ఆమె భర్త ఇంటి వద్ద తల్లిదండ్రులు, బంధువులు కిడ్నాప్ చేసిన ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశామని పోలీసులు ఈరోజు తెలిపారు. కాగా కీసర PS ముందు శ్వేత భర్త ప్రవీణ్ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. శ్వేత కోసం 2 టీంలు వెతుకుతున్నాయని కీసర CI ఆంజనేయులు వెల్లడించారు.