దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయ హుండీ ఆదాయాన్ని లెక్కించడం జరిగిందని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. గురువారం దేవాలయం మండపంలో దేవాదాయశాఖ అధికారుల సమక్షంలో హుండీల ఆదాయాన్ని లెక్కించామన్నారు. గత 105 రోజులకు సంబంధించి హుండీ ఆదాయం రూ.6,31,841 వచ్చిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, అర్చకులు ఉన్నారు.