GNTR: ఫిరంగిపురం మండలం నుదురుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) ఆధ్వర్యంలో గురువారం యర్రగుంట్లపాడు గ్రామంలో సీజనల్ వ్యాధులు, జ్వరాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజలకు డయేరియా వ్యాధుల నివారణ, చికిత్స గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ, ఐసీడీఎస్ సిబ్బందితో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.