NTR: దసరా ఉత్సవాలలో భాగంగా గురువారం దుర్గగుడి పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ నెలకొంది. భక్తుల సంఖ్య అధికంగా పెరగడంతో సుమారు కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. అమ్మవారి దేవాలయానికి వెళ్లే వాహనాలు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. 40 సంవత్సరాలకోసారి వచ్చే కాత్యాయని అమ్మవారి అలంకరణను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు.