కృష్ణా: గుడివాడలో ఫ్లైఓవర్ చుట్టుపక్కల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు గాలివాన కారణంగా పైకి ఎగిరి పడుతున్నాయి. దీని వలన వాహనదారులు ప్రాణాపాయంలో పడే పరిస్థితి నెలకొంది. నిన్నటి నుండి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వెంటనే ఈ ఫ్లెక్సీలను తొలిగించాలని, భవిష్యత్ భద్రతా దళం అధ్యక్షుడు మురళీకృష్ణ గురువారం కోరారు.