KMM: దొంగ హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందని గురువారం ఖమ్మంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో చెప్పారు. ఇచ్చిన అబద్ధపు హామీలు నెరవేర్చలేక కాలం గడుపుతూ అధికార పార్టీ నేతలు కేసిఆర్ పై నిందలు వేస్తున్నారని విమర్శించారు.