VZM: గజపతినగరం మండలంలోని మధుపాడ గ్రామంలో పోషణ మాసోత్సవంలో భాగంగా గురువారం ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు శ్యామలత ఆధ్వర్యంలో పోషణ మహా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ అనూజ్ రాయ్ ఎటువంటి ఆహారం తీసుకోవాలో సూచించారు. అనంతరం సూపర్వైజర్ శ్యామలత మాట్లాడుతూ.. ఆకుకూరలు తదితర వాటిలో పోషక విలువలు ఉంటాయన్నారు.