ADB: MLA అనిల్ జాదవ్ నాయకత్వంలోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని కుమారి గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామానికి చెందిన పలువురు నాయకులు, యువకులు MLA అనిల్ జాదవ్ సమక్షంలో BRS పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని MLA కోరారు.