రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో ‘రాజాసాబ్’ మూవీ రాబోతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ రన్ టైం లాక్ అయినట్లు తెలుస్తోంది. 3 నిమిషాల నిడివితో ఇది విడుదల కాబోతుందట. అక్టోబర్ 2న రిలీజ్ కానున్న ‘కాంతార 1’ సినిమా థియేటర్లలో ఈ ట్రైలర్ను ప్రదర్శించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.