W.G: మొగల్తూరు మండలంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన చోటు చేసుకుంది. మండలంలోని ఓ గ్రామంలో నిన్న ఇంట్లో తల్లితండ్రులు లేని సమయంలో బాలికను నిందితుడు కోనాల జాన్ బాబు(55) తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి. వాసు తెలిపారు.