TG: గతంలో జీఎస్టీ తీసుకొచ్చినప్పుడు కేంద్రానికి బీఆర్ఎస్ మద్దతిచ్చిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో కేటీఆర్ 200 మంది జీతగాళ్లతో జీఎస్టీపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తే.. నాలుక చీరేస్తా అని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లలో KTRను ఓడించడానికి సిద్ధం అన్నారు.