AP: వైసీపీ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నో ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నప్పటికీ గతంలో ఎవరూ తనపై కేసులు పెట్టలేదని పేర్కొన్నారు. ‘నేను తప్పు చేయను.. చేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తా’ అని చంద్రబాబు అన్నారు. అలాంటి తనపై వైసీపీ హయాంలో 17 కేసులు పెట్టారని గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రజలు తనను మళ్లీ సీఎంను చేశారన్నారు.