SDPT: గజ్వేల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం నాల్గవ రోజు, శ్రీ మహంకాళి అమ్మవారు 25,000 గాజులతో అలంకరించబడి రోహిణి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవాలయ పూజారి చాడ నందబాల శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు గణపతి పూజ, మంత్రపుష్పాది కార్యక్రమాలు నిర్వహించారు. పంచామృతాలతో అమ్మవారి మూల విరాట్టుకు మహాభిషేకం నిర్వహించారు.