ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని బసినేపల్లి మరియు జెన్నీవారి పల్లి గ్రామాలలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ రఫీక్ నానో యూరియా వాడకం వలన కలిగే ప్రయోజనాల గురించి రైతులకు వివరించారు. అనంతరం పంటలో తెగులు నివారణ మరియు పంట దిగుబడికి తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి రైతులకు వివరించారు.