MNCL: సీపీఐ జాతీయ సమితి సభ్యులుగా మంచిర్యాల జిల్లాకు చెందిన కలవేన శంకర్ ఎన్నికయ్యారు. పంజాబ్‌లో ఈ నెల 21 నుండి 25 వరకు జరిగిన సీపీఐ 25వ జాతీయ మహాసభలో ప్రస్తుతం సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా ఉన్న శంకర్‌ను జాతీయ కౌన్సిల్ సభ్యులుగా 3వ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా సీపీఐ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.