BDK: స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని శ్రమదానం చేశారు. టేకులపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న మరమ్మతులను గురువారం ఎమ్మెల్యే కోరం పరిశీలించారు. అలాగే పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితోపాటు ఎంపీడీవో మల్లేశ్వరి, ఎంపీవో గాంధీ, ఏఈ నవీన్, సీఐ సత్యనారాయణ, ఎస్సై రాజేందర్ పాల్గొన్నారు.