NLR: నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ నందన్ కార్యాలయంలోని 4 అంతస్తులలో అన్ని విభాగాలను గురువారం తనిఖీ చేశారు. వివిధ విభాగాలలో జరుగుతున్న విధులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలోని గదులకు అవసరమైన మేరకు మరమ్మతు పనులను చేపట్టాలని, విద్యుత్ స్విచ్లు, ఫ్యాన్లు తదితర సామాగ్రి అవసరమైన మేరకు రిపేర్లు చేయించాలని సూచించారు.