TG: పవన్ ‘OG’ సినిమా విడుదల సందర్భంగా భద్రాచలంలోని ఏషియన్ థియేటర్లో విషాదం చోటుచేసుకుంది. ‘OG’ సినిమా చూస్తూ అభిమానులు కేకలు వేస్తూ డ్యాన్స్ చేయడంతో థియేటర్లోని భారీ సౌండ్ స్పీకర్లు కూలిపోయాయి. దీంతో ఇద్దరు అభిమానులు తీవ్రంగా గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఇది జరిగిందని అభిమానులు ఆరోపిస్తున్నారు.