VZM: చీపురుపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో మూడవ రోజు గాయత్రి దేవి అవతారంలో దర్శనం ఇస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేపట్టి వైభవంగా పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు.