AP: రాష్ట్రంలోని నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపులో ప్రభుత్వ వైఖరిపై నిరసనగా అక్టోబర్ 10 నుంచి NTR ఆరోగ్య సేవలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వైద్యారోగ్య శాఖ బిల్లులు చెల్లించకుండా కొత్త విధానాన్ని అనుసరించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.