NLR: కావలి మున్సిపాలిటీ పరిధిలో చెత్త నుంచి సంపద తయారీ, విండో కంపోస్ట్ విధానాన్ని నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులల్లా బుధవారం పరిశీలించారు. మోడల్ వార్డు 39లో చెత్త సేకరణ, గ్రీన్ స్పాట్, తులసివనాలను చూసి మున్సిపాలిటీ అధికారులు, సిబ్బందిని అభినందించారు. తడి, పొడి చెత్త వేరు చేసి వాటి నుంచి సంపద తయారు చేయడం అభినందనీయమన్నారు.