వచ్చే ఏడాది జరగనున్న 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు CBSE డేట్ షీట్లను విడుదల చేసింది. ఈ పరీక్షలు ఫిబ్రవరి 17నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే పదో తరగతి పరీక్షలను తొలి విడతలో ఫిబ్రవరి 17 నుంచి మార్చి 6 వరకు; రెండో ఎడిషన్ మే15 నుంచి జూన్ 1వరకు నిర్వహించనున్నారు. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17న ప్రారంభమై ఏప్రిల్ 9న ముగుస్తాయి.