MDK: ఖరీఫ్ వరి ధాన్యం సేకరణకు అధికార యంత్రాంగం సంసిద్ధులవ్వాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా మెదక్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. అక్టోబర్ మొదటి వారం నుంచి ఖరీఫ్ వరి ధాన్యాన్ని సేకరించుటకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 4.23 MT వరి ధాన్యం ఉత్పత్తి కానున్నదని తెలిపారు.