SKLM: పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి జాతర శోభాయాత్ర ప్రశాంతంగా సాగిందని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధాన రహదారి మార్గాలు, శోభాయాత్ర మార్గాల వైపు అదనపు పోలీసు బలగాలని మోహరించి కట్టుదిట్టం చేశామని ఆయన తెలిపారు. ప్రజల సహకారంతో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగలేదని తెలియ జేశారు.