KRNL: గోనెగండ్లలో దసరా సందర్భంగా బీవీ మోహన్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మిగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు భాస్కర్, చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ను బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. యువతను క్రీడల్లో రాణించాలనే ఆలోచనతోనే బీవీ కుటుంబం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు.