NLG: నిబంధనలను ఉల్లంఘించినందుకు నల్గొండ మండలం కంచనపల్లిలోని శ్రీ వెంకటేశ్వర వైన్స్ పై ఎక్సైజ్ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. లైసెన్స్‌లో పేర్కొన్న సమయానికి దుకాణం తెరవలేదని, అమ్మకాలు నిలిపివేశారనే ఆరోపణలు రావడంతో కేసు ఫైల్ చేసినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారాన్ని ఓ ఎక్సైజ్ అధికారి సెటిల్మెంట్ చేశారని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.