SRD: కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అక్టోబర్ 6వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. టీపిటిఎఫ్ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు.