AKP: కలెక్టరేట్లో బుధవారం సాయంత్రం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ విజయకృష్ణన్ జిల్లాలో జరుగుతున్న పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా నాబార్డ్, పాట్ హోల్స్‌కు సంబంధించిన పనులపై ఆరా తీశారు. పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో పీఆర్ ఇంజనీర్ జీ.ఎస్.ప్రసాద్ పాల్గొన్నారు.