VZM: ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం శ్రీ రామనారాయణంలో, శ్రీ దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతి రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్టు సభ్యులు నీరజా శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్బంగా బుధవారం మెహర్ మ్యూజిక్ అకాడమీ, విద్యార్ధులచే ఇవటూరి మెహర్ లత, ఆల్ ఇండియా రేడియో బి-గ్రేడ్ ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో సంకీర్తనామావళి నిర్వహించారు.