ప్రకాశం: సీఎస్ పురం మండలం భైరవకోనలో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా బుధవారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా అమ్మవారిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో భైరవకోనకు చేరుకున్నారు. కాగా, స్థానిక జలపాతం భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ శ్యామ్ సుందర్, ఈవో వంశీ కృష్ణారెడ్డి పాల్గొని పూజలు చేశారు.