ATP: రాప్తాడు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణాలకు నిధులు ఇవ్వాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా 15 కిలోమీటర్ల రోడ్డు పనులు నిధుల్లేక ఆగిపోయాయని పేర్కొన్నారు. రైతులు, విద్యార్థులు, ప్రజల సౌకర్యం కోసం రూ.150 కోట్లు మంజూరు చేయాలని కోరారు.