MBNR: మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని చిన్న దర్పల్లి డివిజన్లో దేవి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి మండపం వద్ద బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కాంక్షించారు. అంతకుముందు నిర్వాహకులు మాజీ మంత్రిని శాలువాతో ఘనంగా సత్కరించారు.