రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ సమీపంలోని ఎలికట్ట అంబా భవాని మాత ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా మూడవరోజు అమ్మవారు గాయత్రి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వస్తున్నారు.