KRNL: దేవనకొండ మండల పశువైద్య శాలలో సంత మార్కెట్ వద్ద గురువారం పశువులకు గాలికుంట వ్యాధి నివారణ టీకాలు వేస్తామని పశువైద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పశువుల ఆరోగ్య రక్షణకు వ్యాధి నిరోధక టీకాలు అవసరమని చెప్పారు. రైతులు తమ పశువులను సమయానికి తీసుకువచ్చి టీకాలు వేయించుకోవాలని సూచించారు.