ప్రకాశం: పెదచెర్లోపల్లి మండలం దివాకర పల్లెలో ఉన్న ఆర్వో ప్లాంటు గత ఆరు సంవత్సరాలుగా పనిచేయట్లేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు తెలిపారు. కిడ్నీ బాధితుల సమస్యలను దృష్టిలో ఆర్వో ప్లాంట్‌కు మరమ్మత్తులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని ఆయన కోరారు. గ్రామంలో ప్రజల నీటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే పునర్ధరించాలని పేర్కొన్నారు.