RR: వనస్థలిపురం ఓల్డ్ బాంబే-విజయవాడ హైవే వద్ద ధ్వంసమైన 900 MM డయా ఆర్సీసీ సీవర్ ట్రంక్ మెయిన్ పైప్ లైన్ అత్యవసర మరమ్మతు పనులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని అధికారులతో చర్చించారు. జలమండలి చేపట్టే మరమ్మతులు పైపు లైన్ విస్తరణ పనులు పూర్తయిన వెంటనే రోడ్డు మరమ్మతు పనులు నిర్వహించాలని ఆదేశించారు.