MLG: ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నిజాం ఆర్డర్ ఆధారంగా ఈ గ్రామాలను గిరిజన గ్రామాలుగా పరిగణించాలన్న హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ గిరిజనేతరులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు ఎన్నికల నిర్వహణ పై ఇవాళ మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేసింది.